బీరుపూర్ మండల్ సర్వసభ్య సమావేశం

Published: Tuesday March 09, 2021
ఆరు శాఖలపై విస్తృతమైన చర్చ, అధికారులు అంకిత భావంతో పనిచేయాలి - ఎంపీపీ మసర్తి రమేష్
బీరుపూర్, మార్చి 08 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండలంలోని సోమవారం రోజున రైతువేదిక భవణంలో  బీరుపూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు మసర్తి రమేష్ అధ్యక్షతన వహించగా ముందుగా వ్యవసాయ శాఖ అదికారిని మాట్లాడుతూ రైతులు వేసిన పంటను వెంటనే అన్ లైన్ చేసుకోవాలని అనూష అన్నారు. విద్యుత్ ఏఈ ప్రవీణ్ మాట్లాడుతు మిడిల్ పోల్సు దాదాపు మండలంలో పూర్తి చేశామన్నారు. రేకులపల్లి సర్పంచ్ ఎలుగందుల లక్ష్మి మాట్లాడుతు ట్రాన్సపర్మార్ మార్చాలని విద్యుత్ ఏఈని కోరగా పూర్తి చేస్తామని అన్నారు. మిషన్ భగీరథ నీళ్లు గ్రామాల్లో రావడంలేదని సభ్యులు అర్డబ్ల్యూఎస్ ఏఈకి తెలుపగా పొంతనలేని సమాధానం ఇవ్వగా సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. చెరువుల్లో నీరు లేనందున వెంటనే నీటిని విడుదల చేసి చెరువులు కుంటలు నింపాలని అధికారులను కోరారు. నర్సింహులపల్లి గ్రామంలో ఎస్అర్ఎస్పి కెనాల్ పైపులైను వేసి మద్యలో గ్యాప్ ఉండటం వలన ప్రమాదం జరిగె అవకాశం ఉందని గ్యాపుపై స్టీలుతో జాలివేయాలని సభ్యులు కోరినారు. భూరికార్డుల్లో తప్పులు సవరించాలని చాలమంది రైతులు ఇబ్బంది పడుతున్నారని మోకపై ఉన్న వారి పేరు రికార్డుల్లో లేకపోవడం భూమిలేని వారిపేర్లు రికార్డుల్లో ఉండడం వాటిని సవరించాలని తహశీల్దార్ ను ఎంపీపీ  కోరారు. అంగన్వాడీ సెంటర్లో నూనె సరాపరా కావడంలేదని సభ్యులు ‌అడుగగా ప్రభుత్వం నుంచి నూనెపాలు సరాపరా చేయడం లేదని గ్రామాల్లో అంగన్వాడి కాలీల నియామకం వెంటనె చేపట్టాలని సభ్యులు కోరగా ఉన్నతాధికారులకు తెలియజేస్తామని సూపర్వైసర్ కుసుమ తెలిపారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి  పనులకు బిల్లులు రావడంలేదని సభ్యులు తెలుపగా వెంటనె ఎంబీ రికార్డు చేస్తానని ఏఈ రాజమల్లయ్య హామీ ఇచ్చారు. అక్రమ కలప అరికట్టాలని అడవిని కాపాడాలని పారెస్టు అధికారులకు సభ్యులు సూచించారు. గ్రామాల్లో సానిటేషన్ చేయాలని మార్చి 31 లోగా వైకుంఠదామం పనులు‌పూర్తి చేయాలని ఇంటి పన్నులు వసూలు‌ చేయాలని సర్పంచులకు ఎంపీవో తెలిపారు. పెన్షన్స్ కోసం అన్ లైన్ చేసి 2 సంవత్సరాలు గడిసిన పెన్షన్ రావడంలేదని నూతన వ్యవసాయం చట్టం ద్వారా రైతులకు‌  అన్యాయం జరుగుతుందని  మండల సర్వసభ్య సమావేశంలో తిర్మాణంచేసి కేంద్రం ప్రవేశ‌పెట్టిన చట్టాన్ని రద్దు చేయాలని ఐకెపి సెంటర్లు యదవిదిగా నడుపాలని తెలిపి సర్వసభ్య సమావేశానికి అధికారులు అజరై అంకితభావంతో పని చేయాలని ఎంపీపీ రమేష్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ పాత పద్మరమేష్ వైస్ ఎంపీపీ బలుమురి లక్ష్మణ్ రావు ఎంపీడీఓ మల్లారెడ్డి తహశీల్దార్ ఎండి అరిపోద్దీన్ సూపరిండెండెంట్ రాజమౌళి ఎంపీవో రామకృష్ణ విండో అధ్యక్షుడు నవీన్ రావ్ సర్పంచులు మహిపాల్ రెడ్డి పర్వతం రమేష్ మేసు యేసు బందెల మరియా అజ్మీర ప్రభాకర్ సుంచు శారద గర్షకుర్తి శిల్పా బోడ స్వప్న ఎంపీటీసీలు రంగు లక్ష్మన్ అడెపు మల్లేశ్వరి నారపాక రమ పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.