వైరా మధిర డివిజన్ విద్యుత్ శాఖ సమీక్ష సమావేశం మధిర

Published: Monday July 18, 2022
జూలై 17 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు మధిర రెడ్డి గార్డెన్స్ నందు నిర్వహించడమైనది. ఈ సమీక్ష సమావేశంలో మదిర సబ్ డివిజన్ మరియు వైరా సబ్ డివిజన్ విద్యుత్ శాఖ అన్ని కేటగిరీల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఖమ్మం జిల్లా సర్కిల్  సూపర్నెంట్ఇంగ్ ఇంజనీర్ ఎస్ సురేంద్ర గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  విద్యుత్ శాఖ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఫీల్డ్ స్థాయి సిబ్బందివిధులునిర్వహించేటప్పుడు ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ ప్రికాషన్స్ తప్పకుండా తీసుకోవాలని, డిమాండ్ కు  తగిన రెవిన్యూ కలెక్షన్లు చేయాలని, మెకానికల్ మీటర్ల స్థానంలో డిజిటల్ మీటర్ లు అమర్చాలని, కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఫోన్ యాప్ ద్వారా సర్వీస్ రిలీజ్ చేయాలని,  ఫ్యూజ్  ఆఫ్ కాల్స్ విషయంలో  సత్వరం  స్పందించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడకుండా , బ్రేక్ డౌన్ కాకుండా ఎప్పటికప్పుడు  ట్రీ కటింగ్ చేయాలని,  కంపెనీ యొక్క అంతర్గత సామర్థ్యం పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైరా డివిజన్        డి ఈ  డి వేణుగోపాల్ , మదిర సబ్ డివిజన్ ఏడిఈ  సిహెచ్ సుధాకర్ రావు, వైరా సబ్ డివిజన్ ఏడిఈ  బి రామకృష్ణ, వైరా డివిజన్ ఏఈలు కెనాగేశ్వరరావు, కుమార్, వేణు గోపాల్, శ్రీధర్, లావణ్య , డివిజన్ స్థాయి సబ్ ఇంజనీర్లు, ఓ ఎం స్టాప్ మరియు ఉమెన్డ సిబ్బంది పాల్గొన్నారు.