సర్పంచ్ యంగల దయామణి ఆధ్వర్యంలో గొర్రెలకు, మేకలకు రుమిని టాక్సీనేషన్ ఇంజక్షన్లు

Published: Friday January 28, 2022
బోనకల్, జనవరి 27 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని కలకోట గ్రామపంచాయతీలో గొర్రెలు మేకలకు సొల్లు కారుట, చీడపారుడు వ్యాధి రాకుండా నిరోధించుట కొరకు మూడు నెలల వయసు నుండి సంవత్సరం వయస్సు గలిగిన మేకలకు గొర్రెలకు మండలంలోని కలకోట గ్రామపంచాయతీ లో ప్రత్యేక క్యాంపు కార్యక్రమం నిర్వహించి(పి పి ఆర్)పేస్టిస్ డి పెస్టిస్ రుమినిటాక్సినేషన్ ఇంజక్షన్ లు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్స్ మాట్లాడుతూ గొర్రెల మేకల లోని సంవత్సరం కాలం వరకు ఇమ్మ్యూనిటి పవర్ పెంచుకొనుటకు వివిధ రకాల బ్యాక్టీరియాల ప్రభావంకు లోనుకాకుండా ఉండుటకు ఈ ప్రత్యేక క్యాంపు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వాక్షినేషన్ వేస్తున్న డాక్టర్ ల బృందాన్ని సర్పంచ్ యంగల దయామణి, రైతులు అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్, లైవ్ స్టాక్ అసిస్టెంట్ నాగేంద్రకుమార్, వెటర్నరీ అసిస్టెంట్ చిన్నయ్య, ఆఫీస్ సబార్డినేట్ ప్రసాద్, గోపాలమిత్ర నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.