క్రీడలతో మానసిక ఉల్లాసం స్నేహభావం పెంపొందుతాయి

Published: Monday December 13, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 12 డిసెంబర్ ప్రజాపాలన : క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు స్నేహభావం పరిఢవిల్లుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్ లో వికారాబాద్ డిస్టిక్ క్రికెట్ ( విడిసి) వ్యవస్థాపకులు విజేందర్, అస్లాం, గౌస్, అశ్విన్, శ్రీశైలం, నూలి విక్రమ్ పటేల్ లు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేశారు. విన్నర్ ఈస్ట్ జోన్, రన్నర్ సౌత్ జోన్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అస్లాం, బెస్ట్ బౌలర్ అజీజ్, బెస్ట్ బ్యాట్స్ మ్యాన్ మతీన్, మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇబ్రాహీం, కోచ్ లు జగన్నాథ్ రెడ్డి, అస్లాం. క్రీడలు స్నేహపూర్వక భావాలను పెంపొందిస్తాయని క్రీడలతో మానసిక ఉల్లాసం మరియు ఉత్సాహం లభిస్తాయన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రతిభ దాగి ఉంటుందని, విద్యార్థి దశనుండే క్రీడారంగాన్ని ఎంచుకోవాలని, అప్పుడే ప్రతిభ బయటకు వస్తుందని అన్నారు. టోర్నమెంట్ లో గెలుపొందిన విజేత జట్టులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి కమీషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, ఎంపీపీ చంద్రకళ, ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.