సిజినల్ వ్యాప్తి నివారణ అరోగ్య వైద్య శిబిరం

Published: Wednesday August 24, 2022
జన్నారం, ఆగస్టు 23, ప్రజాపాలన: సిజినల్ వ్యాదుల నివారణ అరోగ్య వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని మండల వైద్యాధికారి ప్రసాద్ రావు అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కవ్వాల్ గ్రామంలో సీజనల్ వ్యాప్తి నివారణ కోసం అరోగ్య వైద్య శిబిరం ఎర్పాటు చేశారు, ఈ సందర్భంగా స్థానికులకు జ్వరం, మలేరియా, డేగ్యూ,  బిపి, షుగర్, గర్భిణీ స్రీలకు పరీక్షించి మందులు గోలీలు ఇచ్చారు, ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ ఇంటి పరిసరాల అవరణలో నీటి నిల్వలు నుండకూడదని తెలిపారు, మురికి గుంట్టలు తీసివేయాలి, నీటి గుంట్టల వలన దోమలు ఈగలు తయారు అవుతాయి, వీటి వల్ల డెంగ్యూ, మాలేరియా, చికెన్ గున్యా వ్యాదులు వస్తాయి. ఇంటిలో ఆవరణలో నీరు నీల్వవుండకుండ గ్రామ ప్రజలకు, యజమానులకు అవగాహన కల్పించారు, ఈ కార్యక్రమంలో పి సుషీలా, ప్రీయంకినీ, రాంబాబు, ఎచ్ఎ ఎం లీలా సువర్ణ అశా, తదితరులు పాల్గొన్నారు.