తాసిల్దార్ కార్యాలయం ఎదుట రైతు కుటుంబం నిరసన దీక్ష.

Published: Tuesday March 14, 2023

 మధిర రూరల్ మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట రైతు కుటుంబం నిరసన దీక్ష చేపట్టారు ఖమ్మంపాడు సహకార సంఘం బ్యాంకు లో తనకు సంబంధం లేకుండా తన పేరుపై రుణాలు తీసుకొని అట్టి రుణాలను ఇప్పుడు చెల్లించమని ఒత్తిడీ  చేస్తున్నారని ఖమ్మంపాడు సహకార సంఘం బ్యాంక్ బాధితులు *షేక్ లాల్ సాహెబ్* మరియు *షేక్ మీ రాబీలు* తమను మోసం చేసిన పూర్వపు  ఖమ్మంపాడు సొసైటీ సీఈవో దొండపాటి వీరభద్రంపై  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షకు దిగారు వారికి దీక్ష సంఘీభావం తెలిపిన నాయకులు.