ప్రతి గ్రామంలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలి.సిపిఎం డిమాండ్

Published: Tuesday May 11, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 50 పడకలతో కోవిడ్ సెంటర్లు మరియు ప్రతి గ్రామంలో ఐసోలేషన్ కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేసి, ప్రజలను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, సిపిఎం వలిగొండ పట్టణ కార్యదర్శి కూర శ్రీనివాస్ ను డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు. సిపిఎం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు మండల కేంద్రాల్లో ఉన్న ప్రాధమికఆరోగ్య కేంద్రాల్లో 50 పడకలతో కోవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ప్రతి గ్రామంలో 20 నుంచి 30 వరకు కరోనా కేసులు నమోదయ్యాయన్నారు. వారికి సరైన వైద్యాన్ని అందించడంలో వారికి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గ్రామాల్లో ఒక్కొక్క ఇంట్లో ఒకరికి రావడంతో ఆ కుటుంబ సభ్యులకు అందరికి సోకే ప్రమాదముందని అన్నారు. వెంటనే ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి కరోనా బాదితులందరిని కేంద్రానికి తరలించాలని డిమాండ్ చేశారు.కరోనా కష్టకాలంలో ప్రజలందరినీ ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు నగదు పంపిణీ చేయాలని అదేవిధంగా 17 రకాల వస్తువులు రేషన్ షాపుల ద్వారా అందించాలని డిమాండ్ చేశారు. జిల్లా పరిధిలో అనేక వసతులు ఉన్న ఎయిమ్స్ ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా మార్చాలని 500 పడకలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో కరోనా టెస్ట్ లు నిర్వహించాలని, వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు. మారబోయిన ముత్యాలు, వేముల బాల నరసింహ, నరేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.