ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేయాలి.ఎస్ ఎఫ్ ఐ

Published: Tuesday October 12, 2021
యాదాద్రి, అక్టోబర్ 11, ప్రజాపాలన ప్రతినిది : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేసి చదువుతున్న కళాశాలల్లోనే అసైన్ మెంటు రూపకంలో పరీక్షలు నిర్వహించాలని ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల జైపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పరీక్షలు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా సందర్భంగా వారు మాట్లాడుతూ కరోన కాలంలో ప్రమోట్ చేసి మళ్ళీ పాఠాలు వినకుండా లెక్చరర్లు లేకుండా చదువే చదవకుండా పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం తహశీల్దార్ గారికి వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ మండల కార్యదర్శి వేముల నాగరాజు, ఉపాధ్యక్షులు వేముల జ్యోతిబసు, మానస, మౌనిక, నరేందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.