పంచాయతీ రాజ్ ఇంజనీర్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అంజయ్య తాల్క ఆద్వర్యంలో తెలం

Published: Tuesday July 12, 2022
హైదరాబాద్ 11 జులై ప్రజాపాలన: తెలంగాణ ఇంజినీర్స్ డే ను పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆందోల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్  కార్యాలయంలో  ఘనంగా నిర్వహించారు.
1877 జూలై 11న జన్మించారు. హైదరాబాద్ నిజాం పాలనలో చీఫ్ ఇంజనీర్ గా పని చేశారు. హైదరాబాద్ రాష్ట్రంలోని ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్ హిమాయత్ సాగర్ మరియు నిజామాబాద్ జిల్లాలోని అలీ సాగర్ రిజర్వాయర్ వంటి ప్రధాన నీటిపారుదల పనులు, భవనాలు మరియు వంతెనలకు ఆయన బాధ్యత వహించారు. అతను నదీ శిక్షణ మరియు నీటిపారుదల జాతీయ ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా పనిచేశాడన్నారు. 2014 నుండి, తెలంగాణ ప్రభుత్వం అతని పుట్టినరోజు జూలై 11 ను తెలంగాణ ఇంజనీర్స్ డేగా జరుపుకోనున్నట్లు ప్రకటించింది. నాటినుండి తెలంగాణ ఇంజినీర్స్ డే ను రాష్ట్ర లోని  అన్ని ఇంజనీరింగ్ కార్యాలయాల్లో జరుపుకుంటున్నారని తెలియజేశారు. తెలంగాణ ఇంజినీర్స్ డే సందర్భంగా అందరికీ మరొక సారి శుభాకాంక్షలు తెలియజేశారు‌.
ఈ కార్యక్రమంలో  ఎ.ఇ.మొగులయ్య, మధుకర్, చంద్రశేఖర్,రాధిక, రామకృష్ణ,
శేఖర్, మహేష్,సమద్,దత్తు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.