నిరుద్యోగ భృతి ఇస్తానని మాట తప్పిన సీఎం కేసీఆర్

Published: Thursday February 17, 2022
వికారాబాద్ బ్యూరో 16 ఫిబ్రవరి ప్రజాపాలన : కల్లబొల్లి మాటలతో నిరుద్యోగులను నిండా ముంచిన మోసపూరిత వ్యక్తి సీఎం కేసీఆర్ అని నవాబ్ పేట్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గణపురం ప్రసాద్ విమర్శించారు. బుధవారం నవాబ్ పేట్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ యువజన కార్యకర్తలు టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నిరుద్యోగ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన లక్ష్యం నెరవేరలేదని దెప్పి పొడిచారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించించిందే నీళ్లు నిధులు నియామకాల కొరకు అని గుర్తు చేశారు. ఇంటికొక ఉద్యోగం కల్పిస్తానని ఆశ చూపి నట్టేట ముంచాడని పేర్కొన్నారు. ఎందరో నిరుద్యోగ విద్యార్థులు కొత్తగా సాధించుకున్న రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని లక్షలు ఖర్చు పట్టి ప్రత్యేక కోచింగ్ తీసుకున్నారని వివరించారు. ఉద్యోగ నోటిఫికేషన్ లు రాక అప్పుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పనిచేసిన తల్లిదండ్రులకు నిరుద్యోగులు భారంగా మారారని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ళ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుపల్లి పెంటా రెడ్డి, చేవెళ్ళ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భానూరి ఉపేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పోలీస్ మధుసూధన్ రెడ్డి, మండల అధ్యక్షులు మేడిపల్లి వెంకటయ్య, ఎంపీటీసీ ఇక్బాల్, యాదయ్య, సర్పంచ్ అజయ్ ,ఉప సర్పంచ్ సంగారెడ్డి, చేవెళ్ళ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, మొయినాబాద్  యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నిరంజన్ గౌడ్, సురేష్ గౌడ్, సంగ మేష్, శ్రీనివాస్, పాండు రంగారెడ్డి, మున్వర్, సుధాకర్ గౌడ్, రమేష్ ప్రసాద్, విక్రమ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు