హిమాచల్ ప్రదేశ్ గవర్నర్.. జైహింద్ కుటుంబాన్ని పరామర్శించారు

Published: Thursday June 17, 2021
బాలపూర్, జూన్ 16, ప్రజాపాలన ప్రతినిధి : మృతిచెందిన బండారి జైహింద్ కుటుంబాన్ని పరామర్శించి, ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్ గూడా నంది హిల్స్ కాలనీలో గత నెల (25/05/2021) బండారి జైహింద్ మృతి చెందిన సందర్భంగా ఆ కుటుంబ సభ్యులందరిని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తో పాటు కలిసి స్థానిక బిజెపి నేతలు పరామర్శించారు. బండారి జైహింద్ చిత్రపటానికి నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా అదే విధంగా కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యం ఇవ్వాలని  ప్రతి ఒక్కరు కోరుకున్నారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ మాట్లాడుతూ..... స్థానికంగా ఉండే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ ను ఆ కుటుంబానికి బాధ్యతగా ఉండాలని సూచించారు. కుటుంబ సభ్యులందరికీ ఏ ఆపద , (అవసరం) వచ్చినా తనను సంప్రదించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షులు గుర్రం మల్లారెడ్డి, రాష్ట్ర నాయకులు కడారి జంగయ్య యాదవ్, బిజెపి సీనియర్ నాయకులు మాజీ సింగిల్విండో చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి, సామ సంజీవరెడ్డి, బడంగ్ పేట్ మీర్ పేట్ కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు చెరుకు పల్లి వెంకటరెడ్డి, పెండ్యాల నరసింహ్మ, ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి, కార్పొరేషన్స్ కార్పొరేటర్లు మాధురి వీర కర్ణ రెడ్డి, జెనీగా పద్మ ఐలయ్య యాదవ్, మోడల బాలకృష్ణ, పసునూరి బిక్షపతి చారి, బీజేవైఎం కార్యవర్గ సభ్యులు రామిడి శూర్ణ కర్ణ రెడ్డి, తిరుపతి రెడ్డి సహాయ బిజెపి కార్యకర్తలు, అభిమానులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.