ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు కు మున్సిపల్ కమిషనర్ యూసూప్ షోకాజ్ నోటీ

Published: Thursday June 16, 2022

ఇబ్రహీంపట్నం జూన్ తేది 15 ప్రజాపాలన ప్రతినిధి.గతంలో అధికార పార్టీ కౌన్సిలర్ల ఫిర్యాదు మేరకు మున్సిపల్ నిధులు దుర్వినియోగం జరిగాయని,అనేక అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సుమారు మూడు కోట్లకు పైగా అవినీతి జరిగిందని చైర్మన్ పై  ఆరోపణలు రావడంతో  అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్ మున్సిపల్  ఆఫీస్ ను సందర్శించి పలు రికార్డులు తనిఖీ చేసి సీజ్ చేసిన విషయం విదితమే.ఈ నేపథ్యంలో  తనపై ఉన్న అవినీతి ఆరోపణలపై పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి చందుకు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.ఈ విషయంపై జర్నలిస్ట్  అదనపు కలెక్టర్ ను ఫోన్ ద్వారా వివరణ కోరగా ప్రస్తుతం షోకాజ్ నోటీసు జారీ చేశామని పూర్తి విచారణ తర్వాత మిగతా వివరాలు వెల్లడిస్తామని తెలిపారు
 

*మున్సిపల్ కమిషనర్ తీరు మారేనా.....*

మున్సిపల్లో జరుగుతున్న అనేక పరిణామాలపై, అదేవిధంగా  అవినీతి ఆరోపణల దృష్ట్యా షోకాజ్ నోటీసు జారీ వివరాల కోసం  పలువురు విలేకరులు, ప్రజా ప్రతినిధులు  వివరణ కోరగా  మున్సిపల్ ఆఫీస్లో లేకపోవడంతో  ఫోన్ ద్వారా  సమాచార కొరకు ప్రయత్నం చేస్తే  ఫోన్ ఎత్తకపోవడం, గతంలో పలు సందర్భాల్లో నేను జర్నలిస్టులకు ఏమీ చెప్పను అనడం గమనార్హం. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ యూసుఫ్ పై  అనేక అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సీజ్ చేసిన  శ్యామ్ రెస్టారెంట్ను 24 గంటల్లో తెరిపించడం,కొన్ని బహుళ అంతస్తుల భవనాలు పర్మిషన్లు లేవంటూ పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు లేకపోలేదు.కౌన్సిలర్ర్లు కు సైతం  ఏ విషయం పై కూడా సరైన వివరణ ఇవ్వడం లేదని, మాట దాటేయడం, ప్రజల సమస్యలపై సరిగ్గా స్పందించడం లేదని ఆసహనం  వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా పై అధికారులు మున్సిపల్ కమిషనర్ యూసుఫ్ పై సరైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.