కుష్ఠు వ్యాది మచ్చలపై అవగాహన

Published: Tuesday February 08, 2022
మధిర ఫిబ్రవరి 7 ప్రజా పాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు, మడుపల్లి గ్రామoలో ఎస్సి కాలనీ పిఎస్ నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరపున పిహెచ్సి దెందుకు రు వైద్య అధికారులు డా.వెంకటేష్ డా.శశిదర్ సూచనల మేరకు జిల్లా ఎయిడ్స్ & లెప్రసీ విభాగం ద్వారా పిహెచ్సి పారామెడికల్ హెచ్ఎస్ లంకా కొండయ్య బృందం  కుష్ఠు వ్యాది సర్వేలో భాగంగా సోమవారం ఉదయం ఎస్సి కాలనీ పిఎస్ నందు సంపూర్ణ ముగా విద్యార్థులకు, మధ్యాహ్న భోజన సిబ్బందికి అంగన్ వాడి సిబ్బంది కి కుష్ఠు వ్యాది మచ్చలు గురించి సంపూర్ణ ముగా అవగాహన పరిచినారు. ఈ కార్యక్రమం నకు ఆయా వార్డు కౌన్సిలర్ మేడికొండ కళ్యాణి కిరణ్ ముఖ్య అతిదిగా హాజరై కుష్ఠు రహిత సమాజం కోసం  ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ తెలుపుతూ కుష్ఠు నివారణకు అందరు ప్రతిజ్ఞ చేబూనాలి అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ హెచ్ఎం లింగంపల్లి అప్పారావు హెచ్ఎస్ సుబ్బలక్ష్మి హెల్త్ అసిస్టెంట్ నాగేశ్వరావు అంగన్వాడీ ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.