ఢిల్లీలో సీతారాం ఏచూరిని కలిసిన మాలమహానాడు బృందం

Published: Thursday December 09, 2021
హైదరాబాద్ 07 డిసెంబర్ ప్రజాపాలన ప్రతినిధి: డిల్లీలో రెండవ రోజుకు చేరిన మాల మహానాడు దీక్ష. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ధర్నా రెండో రోజు ఢిల్లీలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిసిన మాల మహానాడు బృందం. ఢిల్లీలో జరుగుతున్న మాల మహానాడు ధర్నాను సందర్శించిన తిరుపతి పార్లమెంట్ సభ్యుడు గురు మూర్తి గారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా రెండో రోజుకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేపట్టవద్దని మద్దతు తెలపాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గారిని మాలమహానాడు బృందం కలిసి వినతి పత్రం అందజేశారు .జంతర్ మంతర్ వద్ద ధర్నాను సందర్శించిన తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి వైఎస్ఆర్సిపి ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ మాల మాదిగలు అన్నదమ్ముల్లా కలిసి ఉండి అంబేద్కర్ ఆశయం అయిన రాజ్యాధికారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య గారు మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ చేపడితే బిజెపి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలంగాణలో మాలలు మాదిగల కంటే అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని ఉషా మెహ్రా కమిషన్ చెప్పినట్లు తెలంగాణలో ఎస్సీ కులాల సమగ్ర అభివృద్ధి అధ్యయనం కోసం ఒక జుడిషియల్ కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీల వర్గీకరణ అనేది ఓటు బ్యాంకు రాజకీయ కుట్ర అని రెండు రాష్ట్రాల ఆవిర్భావం తర్వాత దీనికి శాస్త్రీయ బద్ధత చట్టబద్ధత లేని కాలం చెల్లిన డిమాండ్ అని చెన్నయ్య పేర్కొన్నారు. ఈ ధర్నాలో రెండు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నన్నేది పుష్ప రాజు, సూర్యాపేట మహిళా అధ్యక్షురాలు పిట్టల భాగ్యమా, ఖమ్మం అధ్యక్షులు ముడుసు జగన్ ప్రతాప్, వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు సాదు నర్సింగ్రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చిక్కులు గుండాలు, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు కావలి రమేష్, కోటేశ్వరరావు, ముసలయ్య, గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రెటరీమద్దెల వెంకటేశు, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గాజుల పున్నమ్మ, రమణ, శోభ, స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.