దానంలో అన్నదానం ఉత్తమమైన కోమటి శ్రీనివాసరావు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు మధిర

Published: Friday January 13, 2023

 జనవరి 12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలోస్థానిక శ్రీదివ్య షిరిడి సాయి మందిరము- మధిర,నందు ప్రతి గురువారం భక్తుల ఆర్థిక సహకారంతో నిర్వాహకులు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈరోజు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో దాతలు మాజీ శివాలయం చైర్మన్ మధిర సేవా సమితి ఉపాధ్యక్షుడు జాతీయ ఉపాధ్యక్షులు ఆపదలో అందరివాడు కోమటిడి శ్రీనివాసరావు, చిరు వ్యాపార సంఘం అధ్యక్షులు విలేకరులు మున్నూరు కాపు మండల కార్యదర్శి పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు దంపతులతో భక్తులకు అన్న వితరణ చేసినారు ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ భగవంతుడు మనకు ఇచ్చిన శక్తిలో ఎదుటివారికి సహాయం చేయడంలో, ముఖ్యంగా ఒక ప్రాణి నిలవడానికి కావలసినవన్ని అన్నమే, కనుక అన్నదానం చేయటం శ్రేష్టమని, ఏదైనా దానం చేసేప్పుడు విచక్షణ అవసరం కానీ అన్నదానాలలో మాత్రం ఈ నియమం లేదు అని తెలుపుతూ, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయటం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే కనుక  అత్యంత శ్రేష్టమైనదని, "అన్నం పరబ్రహ్మ స్వరూపంని" తెలిపారు ప్రతి గురువారం సాయంత్రం పూట పల్లకి సేవ సాయి భజన ఉంటుందని ఆలయ కమిటీ తెలిపారు.ఈ సందర్భంగా సాయి బాబా గుడి మందిరం నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, బాబా  ఆశీస్సులు అందరికీ కలుగచేయాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో బాబా భక్తులు సేవకులు అర్చకులు పాల్గొన్నారు