ఎంపీ వినయ్ బిస్వాసును అరెస్టు చేయడం అప్రజాస్వామికం

Published: Saturday May 21, 2022
రేగుంట చంద్రశేఖర్
 
 బెల్లంపల్లి మే 20 ప్రజా పాలన ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తున్న, ప్రజా ప్రతినిధులను, అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామిక మని సి పి ఐ  బెల్లంపల్లి నియోజకవర్గ  ఇంచార్జ్ రేగుంట చంద్రశేఖర్ అన్నారు.
 
గురువారం నాడు వరంగల్ లో పేదల ఇండ్ల స్థలాల కోసం సి పి ఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా పోరాటంలో పాల్గొన్న ఎం పి, వినయ్ భిష్వాస్ ను అక్రమంగా పోలీస్ లు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ, శుక్రవారం  బెల్లంపల్లిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో  నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు,
ఈ సందర్భంగా  రేగుంట చంద్ర శేఖర్ మాట్లాడుతూ, కే సి ఆర్ ఇచ్చిన హామీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని,
కనీసం పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి మూడు లక్షల రూపాయలు కేటాయించిన ఇండ్లు కట్టుకుంటారని, పేదల కోసం నిరంతరం పోరాడుతున్న  ఎం పి ని అరెస్ట్ చేయడం దుర్మార్గం అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సి పి ఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యురాలు  ,బొల్లం పూర్ణిమ,పట్టణ కార్యదర్శి గుండ చంద్ర మాణిక్యం,మండల కార్యదర్శి బొంతల లక్ష్మినారాయణ,మేకలరాజేశం, జిల్లా సమితి సభ్యులు అక్క పెళ్లి బాపు, ఆడెపు రాజమౌళి,  ఎల్తూరి శంకర్, రత్నం రాజం, స్వామిదాస్, బొంకూరి రామచందర్,  కే. రాజేష్, ఎల్కుర్తి వెంకటేష్, మామిడి బాలాజీ, రాయమల్లు, మల్లన్న, రాంచందర్, తదితరులు పాల్గొన్నారు.