ఆళ్లపాడులో కరోనా వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు

Published: Wednesday September 29, 2021
బోనకల్, సెప్టెంబర్ 28, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు ఆధ్వర్యంలో ఈరోజు పంచాయతీ కార్యాలయం నందు కరోనా వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు చేయడమైనది. గ్రామంలోని ప్రజలందరూ 1వ వ్యాక్సిన్ వేసుకోవాలని ఈరోజు అందరికీ పూర్తి చేయాలని సర్పంచ్ ఆదేశించారు. అందువలన ప్రజలందరూ తప్పక వ్యాక్సిన్ వేయించుకొనుటకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు ఏఎన్ఎం తిరపతమ్మ, పంచాయతీ కార్యదర్శి పరశురామ్, ఆశా కార్యకర్త రత్నకుమారి మరియు అంగన్వాడి టీచర్ తదితరులు పాల్గొన్నారు.