కళ్యాణలక్ష్మీ,సీఎం సహయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Tuesday February 01, 2022

సారంగాపూర్, జనవరి 31 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండలానికి చెందిన లబ్దిదారులకు ఇంటింటికీ బైక్ పై వెళుతూ స్వయంగా కళ్యాణలక్ష్మి సీఎం సహయనిధి చెక్కులను ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీస్తూ చెక్కులను స్వయంగా లబ్దిదారుల చెంతకు వెళ్లి పంపిణీ చేయటంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ కోలా జమునశ్రీనివాస్ జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి వైస్ ఎంపీపీ సోల్లు సురేందర్ పార్టీ ప్రెసిడెంట్ గుర్రాల రాజేందర్ రెడ్డి ప్యాక్స్ ఛైర్మన్ ఏలేటి నర్సింహారెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు ఎంపీటీసీలు సర్పంచులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.