సంగారెడ్డి జిల్లా ప్ర‌జ‌ల చిర‌కాల కోరిక నేర‌వేర్చిన సిఎం కేసిఆర్‌

Published: Thursday May 20, 2021

మెడికల్ కళాశాల మంజూరు పట్ల కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన టిఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షులు వేంకటేశం గౌడ్
సంగారెడ్డి, మే19, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా 6 మెడిక‌ల్ క‌ళాశాల‌లు అనుబంధంగా న‌ర్సింగ్ క‌ళాశాల‌లు, 12 ప్రాంతీయ ఔష‌ధ ఉప కేంద్రాలు, 40 ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌లో ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి ప్లాంట్‌ల ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించ‌డం ప‌ట్ల టిఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షులు వేంకటేశం గౌడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. పేద‌ల‌కు సేవ‌లందించే ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు ఎంతైన వ్య‌యం చేయ‌డానికి ప్ర‌భుత్వం కృషి చేస్తుందని, అందులో భాగంగానే కొత్త‌గా వైద్య‌, న‌ర్సింగ్ క‌ళాశాల‌లు ఏర్పాటు చేస్తున్నార‌ని వేంకటేశం గౌడ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ‌లో మ‌రో 6 వైద్య క‌ళాశాల‌లు, ఆనుబంధంగా న‌ర్సింగ్ క‌ళాశాల‌లు ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల ఎం.బీ.బీ.ఎస్‌, న‌ర్సింగ్ కోర్సులలో విధ్య‌ను అభ్య‌సించాల‌నుకునే తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల‌కు మ‌రిన్ని సీట్లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని ఆయన తెలిపారు. అలాగే కోవిడ్ రోగుల చికిత్స‌కు ఆక్సిజ‌న్ అవ‌స‌రం ఎంతో ఉంద‌ని, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో రోగుల‌కు అవ‌స‌ర‌మైన ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి కోసం రాష్ట్రంలోని 40 ప్రభుత్వ ఆసుప‌త్రుల‌లో ఆక్సిజ‌న్ ప్లాంట్‌ల ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల కోవిడ్ చికిత్స‌కు కావ‌ల‌సిన ఆక్సిజ‌న్ ల‌భిస్తుంద‌ని, కరోనా రోగుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణ‌యం తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసిఆర్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.