దళిత బంధు దేశానికే ఆదర్శండా.కోట రాంబాబు. మధిర

Published: Monday October 03, 2022
అక్టోబర్ 2 ప్రజాపాలన ప్రతినిధి నియోజకవర్గ పరిధిలో చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలోదళిత బంధు యూనిట్ ను పంపిణీ చేసిన డా.కోట రాంబాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూదళిత కుటుంబాల ఆర్ధిక అభ్యున్నతిని కాంక్షిస్తూ కేసీఆర్  ప్రభుత్వం దళిత బంధు పథకం అమలుకు సంకల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు *డా.కోట రాంబాబు*  అన్నారు.పాతర్లపాడు గ్రామంలో దారెళ్ళి రమేష్, సురేష్ కు దళిత బంధు ద్వారా మంజూరు అయిన జెసిపి ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా డా.కోట రాంబాబు  మాట్లాడుతూ... దళిత బంధు దేశానికే ఆదర్శం అని, లబ్ధిదారులు ఈ మొత్తాన్ని తమకు నచ్చిన వ్యాపార రంగంలో పెట్టుబడిగా పెట్టి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని, తద్వారా మరో పది మందికి ఉపాధి కల్పించాలన్నదే దళిత బంధు పథకం ఉద్దేశ్యమని చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలనే తపనతో ముఖ్యమంత్రి కేసీఆర్  అన్ని వర్గాల వారి కోసం పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాండ్ర పిచ్చయ్య , ఎంపిటిసి బొర్రా ప్రసాద్ , ఉప సర్పంచ్ తేలుకుంట్ల శ్రీనివాసరావు , మాజీ ఎంపిటిసి వీరబాబు , పంగా గోపయ్య , ఐతం అదినారయణ , ఇండ్ల సురేష్ , పొట్టా ప్రసాద్  తదితర గ్రామస్థులు పాల్గొన్నారు.