బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను నెరవేర్చాలి

Published: Tuesday April 06, 2021

 

బలహీన వర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ రాములు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్  05 ( ప్రజాపాలన ) : మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను దళితులు గిరిజనులు మైనారిటీలు వెనుకబడిన తరగతుల వారు అందిపుచ్చుకోవాలని రాష్ట్ర బలహీనవర్గాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకట్ రాములు హితవు పలికారు. సోమవారం జిల్లా కేంద్రంలో బిజేఆర్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అధ్యక్షుడు వెంకట్ రాములు మాట్లాడుతూ చదువుకున్న వారందరికీ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. అగ్రకులాలు భూస్వాములు పెత్తందారుల దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడు అని కొనియాడారు. దళితులు గిరిజనులు వెనుకబడిన తరగతుల బాగా చదివి రాజకీయాల్లోకి రావాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను రోజు రోజుకు పెడుతూనే ఉన్నారు. కానీ, ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను నెరవేర్చే టట్లుగా అడుగులు వేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ నిర్వహణ కార్యదర్శి వడ్ల అమరేశ్వర్ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షుడు అబ్దుల్ బషీర్ బి వి ఎస్ ఎస్ సంఘం రాష్ట్ర నాయకులు మహమ్మద్ జాకీర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరసింహ గౌడ్ రాష్ట్ర నాయకులు జబ్బార్ జిల్లా నాయకులు మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.