ప్రశ్నించే గొంతుకను అక్రమ అరెస్టులతో ఆపలేరు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ అక్

Published: Thursday April 06, 2023
బోనకల్, ఏప్రిల్ 5 ప్రజా పాలన ప్రతినిధి:భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్ట్ పై వారిని కలిసేందుకు బయలుదేరిన బోనకల్ మండల బిజెపి నాయకులను స్థానిక ఎస్సై కవిత ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ని అర్ధరాత్రి ఏ కారణం చూపకుండా ఏ నోటీస్ ఇవ్వకుండా అక్రమ అరెస్ట్ చేశారని, బండి సంజయ్ కుమార్ ని కలిసేందుకు వెళ్తున్న మండలానికి చెందిన బిజెపి నాయకులు మండల అధ్యక్షులు వీరపనేని అప్పారావు, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరు సురేష్ , జిల్లా ఓబీసీ కార్యదర్శి జంపాల రవి, మండల బీజేవైఎం అధ్యక్షులు కాలసాని పరశురాం లను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ అక్రమ అరెస్ట్ లను తీవ్రంగా ఖండిస్తు పోలీసు అధికారులు కెసిఆర్ కుటుంబానికి కట్టుబానిసల్లగా పనిచేస్తున్నారని, ప్రశ్నపత్రాల్ని లీకేజీ కాకుండా చేయలేని అసమర్థ ప్రభుత్వం అని లికేజీలను ప్రశ్నిస్తే సిట్ నోటీసులు ఇవ్వటం అక్రమంగా అర్థరాత్రి అరెస్ట్ చేయటం కెసిఆర్ కు బిజెపి భయం పట్టుకుంది అనిఅన్నారు. ఇది నియంతృత్వ , నియంత పాలనకు నిదర్శనం బీఆర్ఎస్ పార్టీకి రోజుల దగ్గర పడ్డాయి అని అన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులను ఈ అక్రమ అరెస్ట్ లతో, అణిచివేత లతో ఆపలేరని, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వనికి తగిన గుణపాఠం చెబుతారని మండల నాయకులు తెలియజేశారు.