నాయకుల పై దాడిని ఖండించిన అఖిలపక్షం.

Published: Friday June 11, 2021

బెల్లంపల్లి జూన్ 10 ప్రజా పాలన ప్రతినిధి : బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ స్థలంలో ని టకారియ నగర్లో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించడానికి వెళ్లిన అఖిలపక్షం నాయకుడైన గెల్లి జయరామ్ పై దాడి చేసి తీవ్రంగా దూషించిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, జయరామ్ పై జరిగిన దాడిని బెల్లంపల్లి అఖిలపక్షం తీవ్రంగా ఖండిస్తున్నామని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు  విలేకరులతో మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి ముందుగల టకారియా నగర్ లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని తెలిసిన సమాచారం మేరకు నిజనిర్ధారణ చేయడానికి వెళ్ళిన అఖిలపక్ష నాయకులకు తెరాస  భూ ఆక్రమణ దారులైన గోలి శివ, రేవెల్లి విజయ్, కౌన్సిలర్ రాములు నాయక్ మరికొంత మంది వారి అనుచరులు తప్పతాగిన మైకంలో గెల్లి జయరాం పై తీవ్ర దూషణలు చేస్తూ గుండాల్లాగా ప్రవర్తిస్తూ దాడి చేశారని వారన్నారు, టకారియా నగర్ విషయమై గతంలో లో కోర్టుకు కూడా వెళ్ళామని కోర్టు నిబంధనల మేరకు స్థానిక ఆర్డిఓ అక్రమ నిర్మాణాలను గతంలో కూల్చివేయడం కూడా జరిగిందని గుర్తుచేశారు. ఐతే తిరిగి నిర్మాణాలు చేపడుతున్నారని తెలిసిన విషయం పై నిజ నిర్ధారణకు వెళ్లగా మా పై దాడి చేశారని తెలిపారు, మేము దళితులము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు ఇక్కడి నుండి వెంటనే వెళ్లకపోతే బట్టలు చింపుకొని బ్లేడ్తో కోసుకొని పోలీస్ స్టేషన్ కు పోయి మేమే ఫిర్యాదు చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు. కోటి రూపాయల ఈ భూమి కోసం చంపడానికి అయినా చావడానికైనా సిద్ధమేనని అంటూ నాయకుల పై దాడి చేయడం జరిగిందని అన్నారు, ఈ విషయమై తిరిగి కోర్టుకు కూడా వెళ్తామని, ఇప్పటికైనా లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమించి స్థానిక నియోజకవర్గ స్థాయి అగ్ర నాయకుని తోడ్పాటుతో రాత్రికి రాత్రులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చేపడుతున్న నిర్మాణాలను నిలిపివేసి, నిర్మించిన వాటిని కూల్చివేసి  దాడి చేసిన గోలి శివ, రేవెల్లి విజయ్, రాములు నాయక్, వారి అనుచరులపై తక్షణమేచర్యలు తీసుకోవాలని లేదంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు, గెల్లి జయరామ్ యాదవ్, బత్తుల మధు, కాశీ సతీష్, ఆడెపు మహేష్, తదితరులు పాల్గొన్నారు.