బడ్డీ కొట్లు తొలగించటం దుర్మార్గమైన చర్య

Published: Thursday April 14, 2022
అధికారుల చర్యలను ఎండగట్టిన కాంగ్రెస్ నాయకులు వేమి రెడ్డి శ్రీనివాస రెడ్డి కౌన్సిలర్ కోన ధని కుమార్
మధిర 13 ఏప్రిల్ ప్రజాపాలన పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో చిరువ్యాపారులకు సంబంధించి బడ్డీ కొట్లు తొలగింపు దుర్మార్గమని కాంగ్రెస్ నాయకుడు వేమి రెడ్డి శ్రీనివాస రెడ్డి కౌన్సిలర్ కోనా ధని కుమార్ మండల ఐఎన్ టియుసి అధ్యక్షుడు కోరం పల్లి చంటి పేర్కొన్నారు. బుధవారం మధిరలో బడ్డీ కొట్లు తొలగింపు విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరును వారు వ్యతిరేకించారు కనీసం సమయం ఇవ్వకుండా ట్రాఫిక్కి ఇబ్బందులు లేని బడ్డీ కొట్లను సైతం తొలగించటం సరైన పద్ధతి కాదన్నారు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం సూచించిన తర్వాతనే బడ్డీ కొట్లు తొలగిస్తామని హామీ ఇచ్చిన అధికార పార్టీ నేతలు వ్యాపారులకు ఎటువంటి ప్రత్యామ్న్యాయం చూపించకుండానే తొలగించడం దుర్మార్గమైన చర్యగా వారు అభివర్ణించారు.