అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా ఇంద్రాల హరీష్

Published: Monday May 09, 2022

కోరుట్ల, మే 08 (ప్రజాపాలన ప్రతినిధి): అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ అధ్యాక్షులు రాజేష్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కార్యవర్గాన్ని అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.ఏ ముషావిర్ సమక్షంలో ఆదివారం జరిగిన ఎన్నికలలో జిల్లాలోని అన్ని మండలాల సభ్యులు పాల్గొని అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా ఇంద్రాల హరీష్, ఉపాధ్యాక్షునిగా మహ్మద్ జాకీర్ హుస్సేన్, కార్యదర్శిగా వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శులుగా మిర్జా ముక్రం, కోశాధికారిగా లతిష్, కార్యనిర్వాహక సభ్యులుగా వాసం అజయ్ కుమార్, అబ్బుల్ రహిం, గుండేటి ప్రదీప్ లను ఎన్నుకోవడం జరిగిందని అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.ఏ ముషావిర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికయిన నూతన అధ్యక్షులు హరీష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తననీ ఎన్నుకున్న జర్నలిస్ట్ లకు ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం, జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం కృషి చేస్తానని అన్నారు..