రాయికల్ లో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు పున: ప్రారంభించాలి

Published: Friday February 26, 2021
ఎమ్మెల్సీ కవితకు మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి వినతి 
 
రాయికల్, ఫిబ్రవరి 25 (ప్రజాపాలన ప్రతినిధి ): రాయికల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మే 18 వ తేదీ 2018 రోజున ప్రారంభమైన రిజిస్ట్రేషన్లను ఇటీవల నిలిపివేసి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ లను  జగిత్యాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తరలించడంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మల్లి రిజిస్ట్రేషన్ లను రాయికల్ మండలంలో పన: ప్రారంభించాలని గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రాయికల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి రాయికల్ మండల ప్రజల తరుపున వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా రాయికల్ లో రిజిస్ట్రేషన్ లు ప్రారంభమైన నుండి సెప్టెంబర్ 7ప తేదీ వరకు మొత్తం 3745 డాక్యూమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయని ఇందులో 1930 వ్యయసాయ భూముల రిజిస్ట్రేషన్లు 1815 వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయని ఇందువల్ల దదాపు 4కోట్ల ఆదాయం ప్రభుత్వానికి అందిందని కావున తిరిగి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు యధావిధిగా రాయికల్ లోనే జరిగేలా చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. దీనికోసం  కవిత సానుకూలంగా స్పందించి రిజిస్ట్రేషన్లు రాయికల్ లో జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో టి.ఆర్.ఎస్ నాయకులూ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.