మున్సిపాలిటీలో హోటల్ యాజమాన్యాలు ప్లాస్టిక్ నివారణ చేయాలి మున్సిపల్ చైర్మన్

Published: Thursday July 28, 2022
జూలై 27 ప్రజాపాలన ప్రతినిధి బుధవారంనాడు విభజన ఉంటుందని స్పష్టం చేసింది పట్టణములోనీ అన్ని హోటల్ లు వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ హోటల్ యజమానులకు పలు సూచనలు చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ మరియు కమీషనర్కలెక్టర్  ఆదేశాలమేరకు  మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయకర్ మరియు కమీషనర్రమాదేవిహోటల్యాజమాన్యులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో కమీషనర్ మేడం  మరియు చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతి హోటల్ నందు ప్లాస్టిక్ వాడకం ఆపివేయాలని లేనియెడల చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు, అలాగే హోటల్లో పని చేసే ప్రతి ఒక్కరూ టైఫాయిడ్ టెస్ట్ చేసుకోవాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ, హోటల్ లో సర్వ్ చేసేవాళ్ళు చేతులకు గ్లౌజ్ లు వేసుకోవాలి అలాగే తల నుండి వెంట్రుకలు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని, ప్రతి హోటల్ ఆవరణములో కనీసం రెండు మొక్కలు నాటాలని తెలపటం జరిగింది. పై సూచనలు అన్ని ప్రతి ఒక్క హోటల్ యజమానులు చిన్న పెద్ద హోటల్ లు మరియు తోపుడు బండ్లు యజమానులు పాటించాలని పాటించని వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలిపినారు.
ఈ సమావేశంలో చైర్ పర్సన్, కమీషనర్, హోటల్ యజమానులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.