బిజెపి మహిళా కార్యకర్తలపై టిఆర్ఎస్ దాడులను నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్న

Published: Wednesday August 24, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 23ప్రజాపాలన ప్రతినిధిరంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బిజెపి మండల అధ్యక్షులు దండే శ్రీశైలం ,మున్సిపల్ అధ్యక్షులు బూడిద నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ మహిళా కార్యకర్తలపై టిఆర్ఎస్ నాయకుల దాడిని నిరసిస్తూ, బిజెపి నాయకుల ముందస్తు అరెస్టులను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి  కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా పాల్గొన్న ఇబ్రహీంపట్నం అసెంబ్లీ కన్వీనర్ నాయిని సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం సీఎం కేసీఆర్ యొక్క కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీలో సాగిస్తున్న అటువంటి మద్యం మాఫియా లింకులు అన్ని బయటకు వచ్చాయి. వాళ్ల తండ్రి జైలుకి వెళ్తాడు అనుకుంటే తండ్రి కంటే ముందే కూతురు జైలుకెళ్లే పరిస్థితి ఏర్పడిందని, జైలు కి వెళ్లడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, కుమార్తె కవిత, కుమారుడు కేటీఆర్ ముగ్గురు రన్నింగ్ రేస్ లో ఉన్నారని ఒకరికంటే ఒకరు ముందు వరుసలో ఉన్నారని, మద్యం మాఫియాను ప్రశ్నించినందుకు కవిత ఇంటి దగ్గర శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి బీజేపీ మహిళా కార్యకర్తలను ముందస్తు ప్రణాళిక ప్రకారం టిఆర్ఎస్ గుండాలు, పోలీసులు కలిసి మహిళా కార్యకర్తలు అని చూడకుండా విచ్చలవిడిగా దాడి చేయడం జరిగింది.
పేద ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన ధనాన్ని దోచుకుంటూ ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించుకున్న మీ అక్రమ సంపాదనను బయటకు తీయడం ఖాయం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కిసాన్మోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జక్కా రవీందర్,బండి మహేశ్, దొండ రమణ, లిగం శ్రీకాంత్, మల్లేష్ వేణు గోపాల్ రెడ్డి,రామస్వామి, శేఖర్ రెడ్డి,  దాసు, బండి మహేష్, ముత్యాల మహేందర్, బిజెపి మండల మహిళా అధ్యక్షురాలు శ్వేత బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.