క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అలేఖ్యఅశోక్..

Published: Monday December 26, 2022

తల్లాడ, డిసెంబర్ 25 (ప్రజాపాలన న్యూస్): మండలంలోని కేశవపురం గ్రామంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో గ్రామ సర్పంచ్ అలేఖ్యఅశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంది సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అందించిన స్వీట్లను చర్చిలో పాస్టర్లకు పంపిణీ చేశారు. అనంతరం ఆమె గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇశ్రాయేలు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, గ్రామస్తులు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.