ప్రజల నుండి విశేష స్పందన తో మధిర టీఎస్ఆర్టీసీ

Published: Wednesday March 01, 2023
 మధిర ఫిబ్రవరి 28 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు స్థానిక ఆర్టీసీ డిపో నందు జరిగిన డయల్ యువర్ డి. యం. కార్యక్రమం నందు ప్రయాణికులు మరియు పరిసర ప్రాంత ప్రజల నుండి విశేష స్పందన వచ్చినది. ఈ కార్యక్రమం లో మలుగుమడుగు గ్రామం నుంచి శ్రీ బుచ్చిబాబు  మాట్లాడుతూ మధిర నుండి మీనవోలు మీదుగా రామన్నపాలెం వరకు బస్ సర్వీస్ ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో తిరుగున ఈ సర్వీసును ఆదాయం సరిగ్గా రాని కారణంగా రద్దు చేయడం జరిగిందని, ప్రయాణికుల కోరిక మేరకు బస్ సర్వీస్ ఏర్పాటు చేయుటకు కృషి చేస్తామని డిపో మేనేజర్  తెలియజేశారు. శ్రీ రామారావు  మాట్లాడుతూ మధిర కుర్నవల్లి ఖమ్మం బస్ ఏర్పాటు చేయవలసిందిగా కోరినారు. ప్రయాణికుల కోరిక మేరకు గతంలో ఏర్పాటు చేసిన ఈ సర్వీస్  కు  రద్దు చేయడం జరిగినదని తెలియజేసినారు.  పలువురు టీచర్లు, మధిర నుంచి నందిగామ కు సాయంత్రం సమయంలో బస్ సర్వీస్ ఏర్పాటు చేయవలసిందిగా కోరినారు. ప్రయాణికుల అవసరాల  మేరకు త్వరలో తప్పకుండా బస్ సౌకర్యం  కల్పిస్తామని  తెలియజేసినారు. శ్రీ కృష్ణ ప్రసాద్  మాట్లాడుతూ మధిర నుంచి జమలాపురం మీదుగా మైలవరం కు సాయంత్రం సమయంలో కూడా ఒక ట్రిప్పు ఏర్పాటు చేయవలసిందిగా కోరినారు. ప్రస్తుతం నడుపుతున్న ట్రిప్పుకు ప్రయాణికుల ఆదరణ పెరిగి ఆదాయం పెరిగితే తప్పకుండా త్వరలో అదనపు ట్రిప్ ఏర్పాటు  పరిశీలిస్తామని తెలియజేసినారు. మధిర నుంచి శ్రీ రామకృష్ణ  మాట్లాడుతూ గతంలో మధిర డిపో నుంచి ఆపరేట్ చేసిన వివిధ రూట్ల బస్ సర్వీసులను పునరుద్ధరించాలని కోరినారు. ఈ విషయమై పై అధికారులతో సంప్రదించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిపో మేనేజర్  తెలియజేసినారు.  ఈ కార్యక్రమం నందు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేస్తూ టి ఎస్ ఆర్ టి సి  డిపో అ