లక్ష్మీ క్యాటరింగ్ ప్రారంభం

Published: Wednesday March 17, 2021
మధిర, మార్చి16, ప్రజాపాలన : ప్రజలు మధిర బ్రాహ్మణ బజార్లో శ్రీ మాగంటి లక్ష్మీ మరియు రవీంద్ర కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వారి ఆర్థిక సహాయంతో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ క్యాటరింగ్ వ్యాపారాన్ని బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు శ్రీ వేమవరపు వెంకటేశ్వర శర్మ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పరిషత్ అధ్యక్షులు శర్మ గారు మాట్లాడుతూ అర్హులైన బ్రాహ్మణులందరూ తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ అందించే వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి బ్రాహ్మణులపై అమితమైన ప్రేమ, గౌరవం ఉందని, బ్రాహ్మణులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయటం దానికి నిదర్శనం అన్నారు. ఎటువంటి దళారులు, మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుడికె ఫలాలు అందే విధంగా పథకాలను రూపకల్పన చేసి, అమలు చేస్తున్న బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ శ్రీ K.V రమణాచారి గారికి మరియు CEO శ్రీ రఘురామ శర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలను శర్మ గారు తెలిపారు. లబ్ధిదారుడైన  శ్రీ మాగంటి రవీంద్ర కుమార్ మాట్లాడుతూ .... తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సబ్సిడీతో కూడిన లోన్ మంజూరు చేయటం వల్ల నా క్యాటరింగ్ బిజినెస్ కి ఆర్థిక ఊతం కలిగిందని, మధిర బ్రాహ్మణ పరిషత్ వారు బెస్ట్ పథకానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుపుతూ,  సహాయ సహకారాలు అందించడం పట్ల బ్రాహ్మణ పరిషత్ కి కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాక వ్యాపారం మరింత అభివృద్ధి చెందడానికి, మున్ముందు బ్రాహ్మణ పరిషత్ సభ్యులందరి సహకారం మరియు ఆశీస్సులు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో  శ్రీ జక్కేపల్లి మురళీకృష్ణ గారు, శ్రీ శివరాజు శ్రీనివాసరావు గారు, శ్రీ అవధానుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు(అంకురం శాస్త్రి), శ్రీ అవధానుల భాస్కర శాస్త్రి గారు, శ్రీ జక్కేపల్లి నరసింహారావు & సునీత గారు, శ్రీ హరి రవి శాస్త్రి & రాధ గారు, శ్రీ కప్పగంతుల పట్టాభిరామ శర్మగారు, శ్రీ భట్లపెనుమర్తి రాజేశ్వర శర్మ గారు, శ్రీ అవధానుల ఫణీంద్ర శర్మ గారు, శ్రీమతి రాయప్రోలు పద్మావతి, శ్రీ గడ్డమణుగు మోహన్ రావు గారు, శ్రీ భైరవభట్ల విజయ్ కుమార్ గారు పాల్గొన్నారు.