విచారణ జరిపించే వరకు స్థలాన్ని కాపాడండి

Published: Friday April 16, 2021

బెల్లంపల్లి, మార్చి15, ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణం లోని ప్రభుత్వ భూముల్లో 1923 తెలంగాణ సర్వే బౌండరీ యాక్ట్ అండ్ పిఓటి 1977 యాక్ట్ అండ్ రెవెన్యూ యాక్ట్ 2020కి విరుద్ధంగా బెల్లంపల్లి తహసిల్దార్ కార్యాలయం నుండి వెలువడిన ప్రొసీడింగ్ బి/588/2019 తేదీ 31-12-19 మరియు బూద కలాన్ శివారు బాలాజీ ధియేటర్ పక్కన ఉన్న వివాదాస్పద భూమి లో అక్ర మంగా పోల్స్ ఏర్పాటు చేస్తూ చదును చేసిన ఈ విషయంపై మరియు సర్వే నంబర్ 170/79 పై సమగ్ర దర్యాప్తు చేసి కబ్జా కాకుండా ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గెల్లి జయరాం యాదవ్ గురువారం నాడు ఆర్డీవోకు సమర్పించిన విజ్ఞాపన పత్రం లో పేర్కొన్నాడు. బుధకలాన్ శివారు 170 పిపి 944 ఎకరాల ఎక్టెంట్ లో గల ప్రభుత్వ అసైన్డ్ భూములు కబ్జా  అవుతున్నవి అని నకిలీ డాక్యుమెంట్లతో ఖాళీ స్థలాల్లో ఇంటి నంబర్లు పొందుతున్నారని గౌరవ రాష్ట్ర  ఉన్నత న్యాయస్థానం లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్య కొరకు పిటిషను 8213 ద్వారా విన్నవించటం జరిగిందని తదనుగుణంగా  పిటిషను నంబర్ 8213 అనుసరించి ప్రభుత్వ భూములను కాపాడు బాధ్యత ప్రభుత్వ అధికారులదని ఉన్నత  న్యాయస్థానం సూచించటం జరిగింది. ఐన బాలాజీ ధియేటర్ పక్కన ఉన్న 170 పిపి స్థలంలో కాలువను అనుకోని  ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా చదును చేస్తూ అనుమతి తీసుకోకుండా విదాస్పద  భూమిలో సెలవు దినముల్లో పోల్స్ వేయటం జరుగుతున్నది. అదేవిధంగా బాలాజీ ధియేటర్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ప్రొసీడింగ్ నంబర్ 588 ఇయ్యటం జరిగిందని కానీ అది పూర్తిగా ఏకపక్షంగా రికార్డులు చూడకుండా పాత తేదీ లో  ప్రొసీడింగ్ ఇచ్చినట్టుగా అనుమానం కలుగుతున్నది. కావున అట్టి ప్రొసీడింగ్స్ తప్పు అని తెలియచేస్తూ వాటిపై పూర్తి విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎం ఆర్ ఓ ఇచ్చిన ప్రొసీడింగ్ లో సర్వే నంబర్ 278 (పాత) సర్వే నంబర్ కొత్తది  170 అని తెలియ చేసారు. ఎం ఆర్ ఓ రికార్డ్లు సరిగా పరిశీలించినట్టు లేదు కాబట్టి గతం లో 170/79 గ చలామణి   అయినట్టు చూపిన రికార్డ్ ప్రొసీడింగ్ లో 170 గా ఎలా ఇచ్చారని అది పట్టా భూమిగా, ఆలాగే ఎలాంటి సర్వే చేసినట్టు   హద్దులు ఏర్పాటు చేసినట్టు ఎఫ్ లైన్ సర్వే చేసినట్టు ఆధారాలు కూడా చూడకుండా పట్టా పాస్ బుక్ లేకుండా, డిజిటలైజ్  లేకుండా అసలు ధరణి లో మరియు ఆన్ లైన్లో ఎంట్రీ కానీ సర్వే నంబర్ కి ఎలా ప్రొసీడింగ్ ఇచ్చారనీ గతంలో 170/79 అను సర్వే నంబర్ మాగంటి రామచంద్ర రావు కు (పట్టాదారుడికి) ఉన్నట్లు ఉంది. కొద్దీ రోజుల వ్యవధిలోనే అదే సర్వే నంబర్ బై నంబర్ తో 170/79 తో 3 ఎకరాల అసైన్ పట్టావేరే వ్యక్తికి ఎలా వచ్చిందని ఇద్దరిలో ఎవరివి నకిలీవని  డాక్యుమెంట్లు ఎవరు 1977 పీ ఓ టి చట్టానికి  వ్యతిరేకంగా డాక్యుమెంట్లు సృష్టించారని ఆయన అన్నారు, 170/79  సర్వే  బై నంబర్ ఇంకొక వ్యక్తికి కేటాయించినప్పుడు ప్రొసీడింగ్లో ఎలాంటి ఆబ్జెక్షన్స్ లేవు అని ప్రొసీడింగ్ ఎలా ఇస్తారని, రెవెన్యూ  చట్టం 2020 అనుసరించి ఎం ఆర్ ఓ వివాదాస్పద భూముల యందు మార్పులు / చేర్పులు చేయు అధికారం లేదని  తెలిసీ కూడా ఉన్నత అధికారుల అనుమతి లేకుండా విలువయిన కోట్ల విలువ చేసే భూములకు ప్రొసీడింగ్ మంజూరు చేసిన మండల కార్యాలయ అధికారులపై చర్యలు తీసుకొని ఉన్నత అధికారుల అనుమతితో బెల్లంపల్లి ఎం ఆర్ ఓ  కార్యాలయం నుంచి వెలువడిన ప్రొసీడింగ్ 588 రెవెన్యూ చట్టం సెక్షన్ 8 ద్వారా వాటిని రద్దు చేసి వివాదాస్పద భూమి లో చదును చేసిన వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటూ, శాంతి భద్రతల సమస్యగా బావించి బాలాజీ ధియేటర్ పక్కన ఉన్న స్థలం వద్దకు ఎవ్వరిని రాకుండ 60 రోజుల వరకు యాజమాన్య హక్కు తేలేవరకు శాంతియుత వాతావరణం  ఉండునట్లు ఆ స్థలం గతంలో మాదిరిగా ఖాళీ స్థలంగా ఎలాంటి పోల్స్ లేకుండా తొలగించి కోర్టు అనుమతి వచ్చే వరకు ప్రభుత్వ భూమిగా భావించే బోర్డులు పాతి గతంలో వలె ఉంచాలని ఆయన కోరారు.