మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మేక వెంకన్న

Published: Tuesday October 05, 2021
హైదరాబాద్, అక్టోబర్ 4, ప్రజాపాలన ప్రతినిధి : సూర్యాపేటలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పర్యటన. మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మేక వెంకన్నకు నియామక పత్రం అందజేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. ఆదివారం నాడు గాంధీ పార్కులో జరిగిన మాలల రాజ్యాధికార సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు. మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మేక వెంకన్న అధ్యక్షతన మాలల రాజ్యాధికార సదస్సు సూర్యాపేట జిల్లాలోని గాంధి పార్క్ నందు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య మరియు రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి రవి పాల్గొన్నారు. మొదట అంబేద్కర్  విగ్రహానికి పూలమాల వేసశారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి గాంధీ పార్క్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ ఎస్సి వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలందరూ ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. మాలలు భేదాభిప్రాయాలు పక్కన పెట్టి ఐక్యతతో ఉండి వర్గీకరణ జరగకుండా కలిసికట్టుగా కృషి చేయాలనీ తెలిపారు. ఈ సదస్సులో మేక వెంకన్న మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా చెన్నయ్య శాలువా కప్పి గజమాలతో సత్కరించారు. అదే విధంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ మాలలందరూ ఐక్యమత్యంగా ఉండి బహుజన రాజ్యాధికార దిశగా పయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగి ఆనంద్ రావు సూర్యాపేట మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు పిట్టల భాగ్యమ్మ, ప్రధాన కార్యదర్శి జ్యోశ్నా రాజ్, మాల మహానాడు త్రిపురారం మండల అధ్యక్షురాలు స్వర్ణలత, కోదాడ నియోజకవర్గ అధ్యక్షురాలు గ్యాదరి ఎల్లమ్మ, విజయవాడ సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మల నరేష్ బాబు, యస్ శోభన్ మల్లిక్, యస్ శ్యామ్ కుమార్, కె. జోజి వరప్రసాద్, డి.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.