ఆయుష్ పెంచేది ఆయుర్వేదo ఎక్స్ మిలిటరీ మెన్ డా. అనంతయ్య నాయుడు

Published: Tuesday October 25, 2022

మధిర రూరల్ అక్టోబర్  23  ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడుసత్యసాయి ఉచిత ఆయుర్వేద కేంద్రం నందు ప్రతి ఆదివారం ఉచితo గా అందరూ ఆయురారోగ్యాలతో  హాయిగా ఉండాలి అనే దృఢ సంకల్పం తో నడుస్తున్న క్యాంపు నందు ప్రముఖ సామాజిక సేవకుడు ఆరోగ్య పరివేక్షకుడు లంకా కొండ య్య ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని మొక్కలలో ఒకటి ఐన వయ్యారిభామ పార్థినియం మొక్కమొక్క గురించి దాని వల్ల కలిగే అనారోగ్యం గురించి సంపూర్ణ ముగా వివరించారు. ఈ సందర్బంగా ప్రముఖ ఆయర్వేద వైద్యులు విశ్రాంత మిలిటరీ మెన్ శ్రీ ఎస్ అనంత య్య నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసర ప్రాంతంలో మన ఇళ్ళ మధ్య వీధుల వెంట పెరిగే వయ్యారిభామ మొక్క వల్ల ముఖ్యoగా 5 సంవత్సరాల పిల్లల్లో శ్వాసకోస వ్యాదులు ప్రబలుతాయి అని,  కనుక దీనిని నివారించి ఇంటి పరిసర ప్రాంతంలో ఔషద గుణాలు కల్గిన మొక్కలు పెంచాలి అని తెలిపినారు.  ప్రజలకు నిత్యం ఏదో ఒక జబ్బలు మీద అవగాహనా పరుస్తూ ప్రధాన ముగా హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగహన పరుస్తూ ఆ కుటుంబాలకు ఆదరణ కలిపిస్తున్న లంకా కొండయ్య ధన్యడు అని,  ప్రముఖ సత్య సాయి భక్తులు ఎన్నో సామాజిక సేవలు చేస్తూ తన ఇంటిలో 25 సంవత్సరాల  నుండి ఉచిత ఆయుర్వేద వైద్య సేవలు అందిస్తున్న శ్రీ కోనా మోహన్ రావు గారు లంకా కొండయ్యకు హృదయ పూర్వక అభినందనలు తెలిపి నారు.

ఈ కార్యక్రమంలో మధిర ప్రముఖలు, మధిర సేవా సమితి నిర్వహకులు పల్లపో తుల ప్రసాద్ రావు కోమటిడి శ్రీనివాస్ రావు మిరియాలు కాశీ  ఎర్ర లక్ష్మణ రావు  సత్య సాయి సమితి నిర్వహకులు కోట  రంగారావు  విశ్రాంతి ఉద్యోగస్తులు పాల్గొన్నారు.