కాంట్రాక్ట్ క్యారేజ్ వెహికల్స్ కు టాక్స్ మినహాయింపు ఇవ్వాలి :తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స

Published: Thursday September 01, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
 
ఖైరతాబాద్ ఆర్ టి ఏ ఆఫీసులో తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ తరపున కాంట్రాక్ట్ క్యారేజ్ వెహికల్స్ మీద విధించిన టాక్స్ కి మినహాయింపు ఇవ్వాలి అని ఆ అసోసియేషన్ సభ్యులు మెమోరాండం సమర్పించారు.
 
తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతాయి అని ఆశించిన మాకు తెలంగాణ ప్రభుత్వం కన్నీళ్లే మిగులుస్తుంది అని, తెలంగాణ ముఖ్యమంత్రి మరియు అధికారులు విచక్షణ లేకుండా మా తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్స్ మీద దీని ద్వారా బతికే ఎన్నో కుటుంబాలను రోడ్డుకు ఈడ్చే పరిస్థితులు తెస్తున్నారని దానికి నిదర్శనం కాంట్రాక్ట్ క్యారేజ్ వెహికల్స్ మీద  విధించిన టాక్స్ ద్వారా ఎంతోమంది కాంట్రాక్ట్ క్యారేజ్ ఆపరేటర్స్ ఇప్పుడు రోడ్డున పడవలసిన పరిస్థితులు దాపరిచాయని అన్నారు. ఈ సందర్బంగా తమ డిమాండ్ లను ప్రభుత్వం ముందుంచారు
 
వారి ప్రధానంగా మా డిమాండ్లు
 
1)వెంటనే పెంచిన టాక్స్ లను తగ్గించాలి,
2)గ్రీన్ టాక్స్ లను ఎత్తివేయాలి,
3)ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఎలాగైతే అప్పటి ప్రభుత్వాలు పక్క రాష్ట్రాల రవాణాకి ఇచ్చిన టాక్స్ ఎక్సంషన్ కొనసాగించాలి అని ఈ డిమాండ్లను వెంటనే పరిష్కరించకుంటే  రాష్ట్రవ్యాప్తంగా తాము ఆందోళనలకు దిగి రాబోయే ఎన్నికలలో తెలంగాణ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పి తీరుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో పలువురు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.