బద్రు నాయక్ పై రౌడీషీటర్ ను వెంటనే తొలగించాలి: మురళి నాయక్, రమేష్ నాయక్

Published: Saturday January 22, 2022
బోనకల్, జనవరి 21 ప్రజా పాలన ప్రతినిధి: స్థానిక మండల కేంద్రంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బద్రు నాయక్ పై రౌడీషీటర్ ను ఎత్తివేయాలని తాసిల్దార్ కు మెమరండం అందజేసి నారు. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్, జిల్లా అధ్యక్షులు దశరధ నాయక్ ఆదేశానుసారం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బద్రు నాయక్ పై అక్రమంగా బనాయించిన కేసులు వెంటనే తొలగించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. బద్రు నాయక్ వివిధ గిరిజన, సామాజిక మరియు ప్రజల సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తూ ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఉన్నారు. ఇది సహించని అధికార పార్టీ, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్యాయంగా తన పై రౌడీషీట్ బదలాయించి ఒక సామాజిక కార్యకర్తను గుండాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రశ్నిస్తున్న ఇలాంటి గొంతును నొక్కే ప్రయత్నం కూడా చేస్తున్నారని. ముమ్మాటికి అప్రజాస్వామిక చర్య దీనిపై ఉన్నత అధికారులు కూలంకషంగా చర్చించి బద్రు నాయక్ పై వేసిన రౌడీ షీటర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలియజేస్తూ లంబాడి హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు బానోతు మురళి నాయక్, ఉపాధ్యక్షుడు రమేష్ నాయక్ లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు త్రివేణి బాయి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్, కార్యదర్శి ప్రవీణ్ నాయక్, జాయింట్ కార్యదర్శి ఉదయ్ నాయక్ గుగులోతు గోపీనాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు.