ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 1 ప్రజాపాలన ప్రతినిధి *అసైన్ మెంట్ ప్రభుత్వ భూములో సాగు చేసుకొని

Published: Friday December 02, 2022

మంచాల మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ అరుట్ల గ్రామ రెవెన్యూలో ఉన్న సర్వే నెంబర్ 1363 ప్రభుత్వం పంపిణీ చేసిన భూమిలో గత కొన్ని ఏండ్ల నుండి  అరుట్ల చెన్నారెడ్డి గూడ ఎల్లమ్మ తండా బోడ కొండ గ్రామాలకు చెందిన ఎస్టీ.బిసి.ఎస్సి వర్గాలకు చెందిన నిరు పేద రైతులు సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారు ఈ రైతులందరికీ గత ప్రభుత్వలు సర్టిఫికెట్లు పంపిణీ చేసాయి పాస్ బుక్ లు ఇవ్వటం జరిగింది అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డ్ కార్యక్రమంలో అసైన్ మెంట్ ప్రభుత్వ భూమి1363సర్వే నెంబర్ లోఉన్న రైతులకు పంపిణీ చేసిన భూమి వివరాలు పూర్తిగా ఆన్ లైన్ రికార్డు ల నుండి తొలగించటం జరిగింది ఈ విషయం పై రైతులు అందరూ కలసి మాకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూమి మాకు ధరణి పోర్టలోపెట్టి ఈ పాస్ బుక్ లుఇవ్వాలి అని తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేయటంతో కొంత మంది రైతులకే పాస్ బుక్ పంపిణీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొంది అన్నారు పాస్ బుక్ లు రాని మరి కొంత మంది రైతులు మాకు పాస్ బుక్ లు రాలేదు అని అడుగుతే ఈ సేవలో1500వందలు పెట్టి దరఖాస్తు పెట్టుకోవాలి అని అధికారులు చెప్పటంతో చాలా మంది రైతులు డబ్బులు ఖర్చు పెట్టి ఈ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా ఏ ఒక్క రైతు కు భూమి వివరాలు ధరణి పోర్టలో నమోదు కాలేదు మళ్ళీ అధికారులను అడుగుతే అన్ని రిజెక్ట్ అయ్యాయి అని సమాధానం చెప్పటమే కాకుండా మళ్ళీ ఈ సేవలో దరఖాస్తు చేసుకోవాలి అన్నారు ఈ సేవ కేంద్రానికి వెళ్ళి అడుగుతే దరఖాస్తు చేసుకోవటానికి1363సర్వే నెంబర్ ఆప్షన్ లేదు అని చెప్పటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రభుత్వం భూమిలో సాగు చేసుకుని జీవనం సాగిస్తు రికార్డులోఉన్న ప్రతి రైతు వివరాలు ధరణి పోర్టలో నమోదు చేస్తాం పాస్ బుక్ లు ఇస్తాం రైతులు అందరూ ఈ సేవ కేంద్రలో దరఖాస్తు చేసుకోవాలి అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ఇప్పట్టి వరకు ఏ ఒక్క రైతుకు న్యాయం చేయక పోగా దరఖాస్తు కూడా చేసుకోకుండా ఆప్షన్ తీసి వేయటం మహా దారుణం అన్నారు ఇప్పట్టికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ సేవలో దరఖాస్తు చేసుకోవటానికి 1363 సర్వే నెంబర్ ఆప్షన్ మొదలు పెట్టాలి రైతుల రికార్డు లు అన్ని పరిశీలించి రైతుల భూమూల వివరాలు ధరణి పోర్టలో నమోదు చేసి ఈ పాస్ బుక్ పంపిణీ చేసి రైతులకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేస్తున్నాం