కెసిఆర్ కు ప్రజలే బుద్దిచెపుతారు

Published: Thursday July 07, 2022
మఠంపల్లి లో ఏపూరి సోమన్నపై దాడిన ఖండించిన వైయస్సార్ టిపి మండల అధ్యక్షులు మౌలాలి
 
 బోనకల్, జులై 6 ప్రజా పాలన ప్రతినిధి: హుజూర్ నగర్ నియోజకవర్గంలో లకారం అనే గ్రామంలో వైయస్సార్ టిపి అధినేత్రి వైయస్ షర్మిలమ్మ నిరుద్యోగుల నిరాహార దీక్ష చేపట్టారు. ఆ నిరాహారదీక్షకు పెద్ద ఎత్తున ప్రజల పాల్గొనడం చూడలేక అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన సైది రెడ్డి మనుషులు రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న పై దౌర్జన్యానికి దిగి ఆయనపై బెదిరింపులకి పాల్పడి, అక్కడ దీక్షను భగ్నం చేయుటకు అధికార పార్టీ గుండాలు అతనిని బెదిరిస్తూ ఘర్షణ, పెద్ద ఎత్తున అలజడలు లేపినారు. ఏపూరి సోమన్న పై సైది రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డాడని, బెదిరింపులకు పాల్పడిన టిఆర్ఎస్ ప్రభుత్వం పై బోనకల్ మండల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇలాంటి అరాచక వాదులను అరికట్టాలని తీవ్రంగా ఖండించింది. పోలీసులు సైది రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని. వైఎస్ షర్మిలమ్మ ఆదేశాల మేరకు ఏపూరి సోమన్న,కి భద్రత కల్పించాలని, లేనిపక్షంలో ఏమి జరిగినా దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ తెలంగాణ మండల సమావేశంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ మౌలాలి, అధికార ప్రతినిధి మర్రి ప్రేమ్ కుమార్ ,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మంద నాగరాజు, బోనకల్ గ్రామ శాఖ అధ్యక్షులు చిట్టి నోజుశ్రీనివాస్, షరీఫ్, జాన్ మియా ముజఫర్ నబి,తదితరులు పాల్గొన్నారు.