ఎయిమ్స్ హాస్పటల్ లో అరుదైన ఆపరేషన్

Published: Wednesday March 16, 2022
మంచిర్యాల టౌన్,మార్చి15, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా ఎయిమ్స్ హాస్పటల్ నందు అత్యాధునిక పద్ధతిలో మాస్క్వెలెట్ టెక్నిక్ ద్వారా అవయవ పునర్నిర్మాణం ద్వారా నుజ్జు నుజ్జు అయిన కాలుకు అత్యంత క్లిష్టమైన, అరుదైన శస్త్ర చికిత్స చేసి విజయవంత చేసారు డా॥ శ్రీనివాస్ యెగ్గన. వివరాల్లోకి వెలితే ఆనందపూర్ గ్రామం కన్నెపల్లి మండలంకి చెందిన చిద్దం రాజం, 25 సం.లు రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ కాలుపై నుండి వెల్లగా కాలు నుజ్జు నుజ్జు అయి దానితోపాటు తలకు తీవ్రగాయం అయి చేయి రెండు ఎముకలు విరగగా తీవ్ర రక్తస్రావంతో కోమలో కి వెళ్లి ఎయిమ్స్ హాస్పటల్ నందు అడ్మిట్ కావడం జరిగింది. దీనిని పరీక్షించిన డా॥ శ్రీనివాస్ యెగ్గన ముందు ప్రాణాపాయ స్థితి నుండి కాపాడి తరువాత అత్యంత క్లిష్టమైన, ఆరుదైన ఆపరేషన్ మాస్క్వెలెట్ టెక్నిక్ ద్వారా అవయవ పునర్నిర్మాణం చేసి కాలు తీసివేయకుండా కాపాడారు. తదుపరి మరసటి రోజు చేతికి కూడ ఆపరేషన్ చేసి విజయవంతం చేశారు. అయితే ఈ సందర్భంగా పేషంట్ మరియు వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, డా॥ శ్రీనివాస్ యెగ్గన ప్రాణంతోపాటు కాలుసైతం కాపాడి అత్యంత అరుదైన ఆపరేషన్ చేసి తమకు పునర్జన్మనిచ్చారని కృతజ్ఞతలు తెలిపారు.