ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఉచిత వైద్య శిబిరం

Published: Thursday July 07, 2022
 రాయికల్, జులై 6 ( ప్రజా పాలన ప్రతినిధి):
 ఈరోజు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారి 60 వ జన్మదినం సందర్భంగా రాయికల్ మండలం           ఒడ్డేలింగాపూర్ గ్రామంలో ఈదుల  సునీత లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో  ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా ఇట్టి కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు      లావుడ్యా సంధ్యారాణి సురేందర్ నాయక్  హాజరై ముందుగా కేక్ కట్ చేశారు అనంతరం వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాలకుర్తి రవి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు
కోల శ్రీనివాస్, రైతు బందు సమితి మండల అధ్యక్షుడు మోహన్ రావు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అనుపురం శ్రీనివాస్ గౌడ్, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ఈదుల లక్ష్మణ్, మాజీ సర్పంచ్ సక్రు నాయక్, పార్టీ గ్రామ అధ్యక్షుడు దుబ్బ రెడ్డి, మరియు వైద్య బృందం మరియు  గ్రామస్తులు పాల్గొన్నారు.