ఘనంగా స్వామి వివేకానంద 160వ జయంతి వేడుకలు

Published: Friday January 13, 2023
జన్నారం, జనవరి 12, ప్రజాపాలన: మండలంలోని రేండ్లగూడ గ్రామంలో స్వామి వివేకానంద 160వ జయంతి  వేడుకలను నిర్వహించడం జరిగిందని గురువారం గ్రామ బిజెపి అధ్యక్షులు రవి చారి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్ఠిను విశ్వవ్యాపితం చేశారని ఆయన పేర్కొన్నారు. జాతీయ యువజన సభ్యులకు ప్రాధాన్యం నేర్పిన వారయ్యారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు బెడద గోపాల్, బిజెపి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.