ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి ****ప్రగతి యాత్ర,,,, ప్రజల యాత్ర* ప్రజలు నాపై చూ

Published: Saturday February 11, 2023

ప్రగతి నివేదన యాత్రలో భాగంగా. ముంచాల మండలం తెలంగాణ ప్రభుత్వం  గత 8 సంవత్సరాలలో ప్రభుత్వం చేసిన పనులను వివరించేందుకే  మంచాల గ్రామానికి చేరుకొని ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించి.  ప్రగతి నివేదన పాదయాత్రలో ప్రారంభించి నేటికి 20 రోజులు గ్రామాలు తిరుగుతూ  మంచాల గ్రామానికి గడపగడపకు ప్రతి ఒక్క మహిళలను పలకరిస్తూ సమస్యలపై అడిగి తెలుసుకుంటున్న ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఫలాలు అందరికీ అందుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకుంటున్న ప్రశాంత్ రెడ్డి. ప్రజలు ఈరోజు కెసిఆర్ మాకు పెద్ద కొడుకు లాంటివారని ప్రజలు ఆయన బాగుండాలనితెలిపారు.
సంక్షేమ అభివృద్ధి పనులు వివరిస్తూ ప్రజల కోసమే తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని మంచాల గ్రామాన్ని ఇబ్రహీంపట్నం నుండి మంచాల వరకు 14 కోట్లతో రోడ్డు పనులు పూర్తి చేసినటువంటి ఘనత బిఆర్ఎస్ పార్టీద ని మరోపక్క లింగంపల్లి నుండి తాళ్ల పల్లిగూడ వరకు 4.94 కోట్లు ఖర్చు చేసిందని. మార్కెట్ గోదాం ప్రహరీ గోడ నిర్మాణానికి 2.60 కోట్లు ఖర్చు చేసిందని. మహిళా సమైక్య భవనాల నిర్మాణం కు 10 లక్షల రూపాయలు ఖర్చు చేసిందని. ప్రజలకు సంక్షేమ పథకాలలో భాగంగా మహిళలకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ శ్రీనిధి మహిళ భవనాలు  రైతులకు రైతుబంధు దళితులకు దళిత బంధు తెలంగాణ ప్రభుత్వం  మరిన్ని పథకాలతో ముందుకు వెళ్తుందని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య,
మంచాల  ఎంపీపీ నర్మదా లచ్చిరాం నాయక్, ఎంపీటీసీ సుకన్య రెడ్డి, గ్రామ సర్పంచి అని రెడ్డి జగన్ రెడ్డి,  మంచాల మండల పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్, ప్రధాన కార్యదర్శి బహుదూర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పావని వెంకటేష్, బిఆర్ఎస్ నాయకులు బద్రీనాథ్, శివ సాయి, విజయ్, ప్రణయ్ కుమార్, బిక్షపతి, ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.