ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం ను ఆశ్వీరదించండి. పాలేరు శాసనసభ్యులు కంద

Published: Friday September 02, 2022
పాలేరు సెప్టెంబర్ 1ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వం ను ఆశ్వీరదించాలని పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్రెడ్డి కోరారు. మండలం లోని వివిధ గ్రామాల్లో ఆసరా పెన్షన్ల ధృవ పత్రాల పంపిణీ చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమమే ద్వేయంగా ప్రభుత్వం పని చేస్తుందని దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ముందు ఉన్నదని అన్నారు. త్వరలోనే ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3. లక్షల ను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి పార్టీలకి అతీతంగా పెన్షన్లు అందేలా చూస్తామని అన్నారు. ఆసరా పింఛన్లు కుటుంబాలకు అండగా నిలుస్తుందని అన్నారు. పైనంపల్లి లో ఏడు లక్షల అంచనా విలువతో సీసీ రోడ్డు నిర్మాణాని కి శంఖుస్థాపన చేశారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. 
కార్యక్రమం లో  తెరాస పార్టీ మండల అధ్యక్షులు , ఉన్నం. బ్రహ్మయ్య, నేలకొండపల్లి  ఎంపీపీ   వజ్య రమ్య, ఖమ్మం డిసిఎంఎస్ డైరెక్టర్ పైనంపల్లి సొసైటీ చైర్మన్.నాగుబండి  శ్రీనివాస్ రావు,
జడ్పీ వైస్ చైర్మన్  మరికంటి. ధన లక్ష్మి, సీడీసీ చైర్మన్ నెల్లూరి   లీలా ప్రసాద్, సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు  గండు సతీష్,  రైతు సమితి మండల కన్వీనర్  శాఖ మూరి సతీష్, ఆసరా పింఛన్ లబ్ధిదారులు కార్యకర్తలు  పాల్గొన్నారు.