మల్లికార్జున నగర్లో అర్ధాంతరంగా నిలిపివేసిన పనులను వెంటనే ప్రారంభించాలి

Published: Monday March 13, 2023
 సంఘీ స్వామి యాదవ్
మేడిపల్లి, మార్చి12 (ప్రజాపాలన ప్రతినిధి)
చిలుకానగర్ డివిజన్లోని మల్లిఖార్జున నగర్లో నెల పదిహేను రోజుల క్రింద రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించి రోడ్లన్ని తవ్వి వదిలేశారు, దీనికి తోడు ఈ ప్రాంతములో డ్రైనేజి వ్యవస్థ సరిగ్గా లేనందున, మంచి నీరు పైపు లైన్లు కూడ కొన్ని వీధుల్లో లేవు. కొన్ని వీధులో సగ భాగమె ఉన్నాయి, వీటినన్నింటిని వేసి, రోడ్డు వేస్తామని పనులు నిలిపివేయడం వల్ల  కాలనీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మల్లికార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, చిల్కానగర్ డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి సంఘీ స్వామి యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల 15 రోజుల నుండి అధికారులకు ఫోన్ చేసిన ఎలాంటి సమాధానం రావడం లేని పనులు మధ్యలోనే నిలిపి వేయడం వల్ల ప్రజలు అనునిత్యం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను మద్యంతరంగా ఆపివేయడం వల్ల కనీసం నడవడానికి వీలు లేకుండా పోతుందని కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నిసార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. జిహెచ్ఎంసి, జలమండలి అధికారులు స్పందించి పనులను ప్రారంభించక పోతే కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సంఘ స్వామి యాదవ్ హెచ్చరించారు.