ఏటూరినాగారం స్పోర్ట్స్ స్కూల్ కు ఓంఆదిత్య విద్యార్ధి ఎంపిక..

Published: Monday October 17, 2022
ఏన్కూర్, అక్టోబర్ 16 (ప్రజాపాలన న్యూస్): 
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గిరిజన విద్యార్థులు జాతీయస్థాయి క్రీడలలో సత్తా చాటాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఏటూరునాగారంలో ప్రారంభించిన గిరిజన స్పోర్ట్స్ స్కూల్ లో 5 వ తరగతి ప్రవేశాల కొరకు సెప్టెంబర్ నెలలో నిర్వహించిన స్పోర్ట్స్ సెలక్షన్స్ లో ఏన్కూర్ మండలంలోని తిమ్మరావుపేట గ్రామంలో ఉన్న ఓంఆదిత్య గాయత్రి స్కూల్ విద్యార్ధి కుశాంత్ కుమార్ ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆదివారం స్కూల్ లో నిర్వహించిన అభినందన సభలో స్కూల్ యాజమాన్యం విద్యార్థిని, తల్లిదండ్రులను సన్మానించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 40సీట్లలో మా విద్యార్ధి సీటు సాధించడం గర్వకారణమని, రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని స్పోర్ట్స్ స్కూల్స్ లలో ఓం ఆదిత్య గాయత్రి స్కూల్ విద్యార్థులు సీట్లు సాధిస్తున్నందుకు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దివ్య ప్రశాంతి, నరసింహారావు, వ్యాయమ ఉపాధ్యాయులు శోభన్ పాల్గోన్నారు.