చిలుకూరు పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు మధిర సెప్టెంబర్ ఐదు ప్రజా పాలన ప్రతినిధి మండల

Published: Tuesday September 06, 2022
నాడు చిలుకూరు ఉన్నత పాఠశాల నందు గురుపూజ వేడుకలు సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు.పి.వి.ఆర్ & ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో   పాఠశాలలోని ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు ఘన సన్మానం ఏర్పాటు చేశారు. మారుమూల గ్రామమైన  చిలుకూరు పాఠశాలలో గత నాలుగు సంవత్సరాల నుండి 10వ తరగతి పరీక్షలలో 100% ఫలితాలు సాధించడమే కాక 10/10 జీ.పీ.ఏ సాధించినందుకు గాను .వి.ఆర్ & ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు  అదేవిధంగా పాఠశాలలో బాసర త్రిబుల్ ఐటీ నందు సీటు సాధించిన టి గోపీనాథ్ ను కూడా ఘనంగా సన్మానించారు.  పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులను కష్టపడి చదివించి ఉత్తమ ఫలితాలు సాధనకు కృషిచేసిన ఉపాధ్యాయులను కొనియాడారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 
 
ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు ఆయనే రుషి.. జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు.. సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు.. ఆయనెవరో కాదు మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువని అందుకే మన సమాజంలో అమ్మానాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారని శిశువును లోకానికి పరిచయం చేసే అమ్మ మొదటి గురువైతే.. గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు. ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి, విద్యా బుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువని అందుకే పెద్దలు మాతృదేవో భవ. పితృదేవో భవ.. ఆచార్య దేవోభవ అన్నారన్నారు.
దేవుడు, గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తా అన్న మహానుభావుడు కబీర్ దాస్. ఎందుకంటే.. ఆయన భగవంతుడు అని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి అని వివరించారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది. ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి, జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట. అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనదని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వుట్ల  శంకర్రావు వుట్ల రాధాకృష్ణ రావిరాల రవికిరణ్ వై సుధాకర్ ఎం శ్రీనివాస్ పి పురుషోత్తం కే సుజాత జి భూలక్ష్మి ఎం కళావతి లను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నిడమానూరి సంధ్య ఎస్ఎంసి చైర్మన్లు  కే సునీల్ కుమార్ రాంబాబు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు