క్రీడాకారులకు స్పోర్ట్స్ మెటీరియల్ కిట్స్ పంపిణీ

Published: Tuesday May 17, 2022
మేడిపల్లి, మే16 (ప్రజాపాలన ప్రతినిధి)

జిహెచ్ఎంసి వేసవి క్రీడ కోచింగ్ క్యాంప్ 2022 లో భాగంగా ఉప్పల్ జిహెచ్ఎంసి గ్రౌండ్ లో క్రీడాకారులకు స్పోర్ట్స్ మెటీరియల్ కిట్స్ ను చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి క్రీడాకారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి స్పోర్ట్స్ ఇన్స్పెక్టర్ కె వెంకట్ రెడ్డి, కోచ్ టీ బాలరాజు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.