డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన పట్నం మహేందర్ రెడ్డి* -కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడే వార

Published: Friday November 18, 2022

చెవెళ్ల నవంబర్ 17 (ప్రజాపాలన):

చేవెళ్ల  మండల కేంద్రంలోని మహేందర్ రెడ్డి జనరల్ ఆస్పత్రిలో  డయాలసిస్ కేంద్రాన్ని, రూ. 2 కోట్లతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని గురువారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కళాశాల చైర్మన్ పట్నం మహేందర్ రెడ్డి
ప్రారంభించారు.
పేదలకు మెరుగైన సేవలు అందించడమే లక్షమని ఆయన అన్నారు.
కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధ పడే వారికి అతి తక్కువ ఖర్చుతో డయాలసిస్ సేవలు అందిస్తామని, చుట్టూ పక్క గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒక చేవెళ్ల మండలంలోనే 82 మందికి పైగా డయాలసిస్ రోగులు ఉన్నారని, స్థానికంగా వైద్య సేవలు అందుబాటులో లేక నగరంలోని కార్పొరేట్, ప్రయివేట్ ఆసుపత్రులకు వేలాల్సి వస్తుందన్నారు. తమ ఆసుపత్రిలో అన్ని రకాల వ్యాధులకు నిష్ణాతులైన వైద్యులు ఉన్నారని తెలిపారు. త్వరలోనే డయాలసిస్ రోగులకు ఆరోగ్య శ్రీ సేవలు సైతం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆసుపత్రిలో ఆపరేషన్లు చేసిన తర్వాత నొప్పులు తెలియకుండా ఆరోగ్యం మెరుగుపడేందుకు మత్తు మందులు ఉన్నాయని అనస్థీషియ వైద్యురాలు సునీత తెలిపారు. ఈ కార్యక్రమంలో 
పట్నం మహేందర్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డీన్, ప్రిన్సిపాల్ జోయరాని, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వర్ రావు, సీనియర్ ఫ్యాకల్టీ రాజారెడ్డి, మేనేజర్ నాగేశ్వర్ రావు, అనస్థీషియ వైద్యురాలు సునీత, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాసన్నగారి మణిక్యారెడ్డి, నాయకులు రఘువీర్ రెడ్డి, వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు..