*బాలికలకు భద్రతా కల్పించాలి*

Published: Wednesday January 25, 2023
మంచిర్యాల టౌన్, జనవరి 24, ప్రజాపాలన : బాలికలకు మరింత భద్రత కల్పించాలని, సమాజం బాలికలపై వివక్ష చూపకూడదని సెంటర్ ఫర్ లీగల్ ఎయిడ్ అండ్ సోషల్ అవేర్నెస్(క్లాస్) డైరెక్టర్ అడ్వకేట్ మోతె రాజలింగు అన్నారు. మంగళవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ ఏరియాలో     బాలికల దినోత్సవం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని అన్నారు. రాజకీయ పార్టీలు, కమ్యూనిటీ సంఘాలు బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి వారి హక్కులను నెరవేర్చే దిశగా వారిని శక్తివంతం చేయడంపై దృష్టి సారించాలని, బాలికలకు మెరుగైన ఆరోగ్య సేవలు విద్యలో సమాన అవకాశాలు లింగ ఆధారిత వివక్ష బాలికలపై హింస లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా బాలికల దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి జిల్లా అధ్యక్షుడు నందిపాటి రాజు, మునీర్, మాతంగి రాజయ్య గండి రమేష్, బత్తిని రాజు,ఆవుల శ్రీను, కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.