దాడులు ఆపకపోతే ఉద్యమం

Published: Thursday March 25, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ప్రజాపాలన : DCCB. బ్యాంకు వారు జూలూరుపాడు మండలంలో దళితుల ఇళ్లపై ఇండ్లు జప్తు  చేస్తామని దాడులు చేస్తున్నారు ఆ దాడులు ఆపకపోతే తెలంగాణ ఎమ్మార్పీఎస్ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలంగాణ ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మోదుగు రామకృష్ణ బ్యాంకు అధికారులకు హెచ్చరిస్తున్నాను. ఆయన మాట్లాడుతూ ఒకపక్కన కూలీ లేక ఇబ్బందులు పడుతుంటే డబ్బులు కడతారా లేదా ఇండ్లు జప్తు చేయాలా దళిత కాలనీలకు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల క్రితం ఐదుగురు సభ్యులకు 50,000 లోను ఇచ్చినారు ఇట్టి డబ్బులను ఐదు సంవత్సరాల తర్వాత ఇండ్లపై వచ్చి కార్లు జీపులు టాటా ఏసీలు 30 మంది బ్యాంకు అధికారులు పోలీసు వారు వచ్చి డబ్బులు కట్టండి అని  భయభ్రాంతులకు గురిచేస్తున్నారు దళితులను ఇబ్బందులకు గురి ఇ చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారికి ఏదైనా అన్యాయం జరిగినా బ్యాంకు ముందు ముట్టడి చేస్తామని బ్యాంకు నిబంధన ప్రకారం చెప్పండి కానీ ఇండ్లు సామాన్లు జప్తు చేస్తామని దళితులను భయబ్రాంతులకు గురి చేస్తే మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నాను ఈ సమావేశంలో తెలంగాణ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మంద సురేష్ కిన్నెర రవి మంద మోషే మంద రమేష్ నార పోగు చిన్న నరసింహారావు పోతురాజు మోహన్ రావు గార్లపాటి వెంకటి తదితరులు పాల్గొన్నారు